![]() |
![]() |

జీ తెలుగులో " సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ " అంటూ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. "సరదా పాటలు సరాగాలుగా మారిన వేళ, రివ్వున ఎగసే గువ్వలా పదనిసలు పరుగులు తీసిన వేళ, గమకాలు గగనాన్ని తాకుతాయి మధురిమలు మౌనాల్ని దాటేస్తాయి. పల్లవులు మది చరణాలను పలకరిస్తాయి. సరిగమప ఈసారి సరికొత్తగా " అంటూ ఒక లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది.
జీ తెలుగులో ప్రసారమవుతున్న జీ సరిగమప ఇప్పటి వరకు 17 సీజన్ లు పూర్తిచేసుకున్నాయి. 2018 లో సరిగమప విన్నర్ గా రేణు కుమార్ నిలిచారు. సీజన్ 13 ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ 2020 విజేతగా కొండేపూడి యశస్వి నిలిచారు. సీజన్ 14 ది సింగింగ్ సూపర్ స్టార్ - 2022 శృతిక సముద్రాల టైటిల్ కైవసం చేసుకున్నారు. సీజన్ 16 ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ - 2024/2025 అభిజ్ఞ విన్నర్‌గా నిలిచారు.
ఇక ఇప్పటి వరకు సరిగమప సీజన్స్ లో జడ్జెస్ గా మ్యూజిక్ డైరెక్టర్ కోటి, నేపధ్య గాయనీమణులు ఎస్పీ శైలజ, స్మిత, గీత రచయతలు చంద్రబోస్, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, అలాగే స్పెషల్ సెలబ్రిటీ జడ్జెస్ గా అనిల్ రావిపూడి, నిహారిక కొణిదెల, విజయ్ ప్రకాష్ వంటి వాళ్లంతా ఉన్నారు. మరి ఈసారి జడ్జెస్ గా ఇంకెవరు వస్తారో అసలు ఈ సీజన్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
![]() |
![]() |